calender_icon.png 13 May, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామస్థుల ఐక్యత అభినందనీయం

12-05-2025 12:34:49 AM

 గ్రామ దేవతల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

చేర్యాల, మే 11: గ్రామస్తుల ఐక్యతతో గ్రామ దేవతలను ప్రతిష్టించుకోవడం అభినందనీయమన్నారు. చేర్యాల మండలంలోని కొత్త దొమ్మట గ్రామం లో పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపనలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లుల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో, సిరి సంపదలతో  తులతూగి, పంటలతో పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు.

గ్రామానికి విద్యాపరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇప్పటికే వైద్య పరంగా అన్ని సేవలను అందిస్తున్నామన్నారు. ఆలయాల నిర్మాణాలకు దాతలు అందించిన సాహయం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు అంకు గారి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కర్ణాకర్, బుర్రగోని తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.