01-12-2024 03:54:15 AM
అదుపుతప్పి వాహనదారులకు గాయాలు
కాప్రా, నవంబర్ 30: కుషాయిగూడ ప్రధాన రోడ్డపై ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో పలువురు ద్విచక్రవాహనాదారులు కిందపడి తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తా నుంచి కీసర వెళ్తుండగా చక్రీపురం వద్ద ట్యాంకర్ నంచి అయిల్ లీక్ కావడంతో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనాదారులు అదుపుతప్పి కిందపడ్డారు.
అందులో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. ట్యాంకర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.