calender_icon.png 19 September, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్‌తో రైతులకు స్థిర ఆదాయం

19-09-2025 12:20:23 AM

* సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

హుస్నాబాద్, సెప్టెంబర్ 18:రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, దీర్ఘకాలిక స్థిరమైన ఉపాధిని కలిగించే పంటగా ఆయిల్ పామ్ను సాగు చేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. గురువారం ఆమె సిద్దిపేట జిల్లా మోత్కూలపల్లిలో రెండవ మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె రైతులతో మాట్లాడారు.

ఆయిల్ పామ్ పంటకు మార్కెట్, ప్రాసెసింగ్, సబ్సిడీ మద్దతు లభిస్తోంది. ఒకసారి నాటితే దీర్ఘకాలం పంటను కోయవచ్చు. రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుంది. కొత్త రైతులు కూడా ఈ పంట సాగు చేయడానికి ముందుకు రావాలి. ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఏవో స్వరూప, డీహెచ్‌ఎస్ వో సువర్ణ, హార్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ, ఎంఏవో తస్లీమా, ఏఈవోలు, ఫీల్ అసిస్టెంట్ రవళి పాల్గొన్నారు.