calender_icon.png 19 September, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టోకెన్లు ఇచ్చి యూరియా ఇవ్వకుంటే ఎట్లా?

19-09-2025 12:20:30 AM

  1. నిర్లక్ష్యం వహించిన పారిపై చర్యలు తీసుకోండి 

ఏడిఎ ను ఆదేశించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

నవాబ్ పేట, సెప్టెంబర్ 18 : టోకెన్లు ఇచ్చి యూరియా ఇవ్వకుంటే ఎట్లా అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. డీటలర్లు అధికారులు బాధ్యతగా యూరియాను రైతులకు అందించాలని ఆదేశిం చారు. నవాబ్ పేట మండలంలో కోరమండల్ డీలర్ చేసిన అవకతవగలను పూర్తిస్థాయిలో పర్యటనలోకి తీసుకొని నిర్లక్ష్యం వహించినందుకు గాను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కోరమాండల్ డీలర్ కు మంగళవారం 460 బస్తాల యూరియాను కేటాయించి, దానికి సంబంధించి 460 మంది రైతులకు టోకెన్లు జారీ చేయగా, కోరమాండల్ లో పని చేసే మధు శేఖర్ అనే వ్యక్తి టోకెన్లు లేకుండానే సుమారు 200 మందికి యూరియాను ఇచ్చాడని, దీంతో అక్కడ టోకెన్లు తీసుకున్న రైతులు అందరికీ యూరియా దొరక్క వారు ఆందోళన చేశారని తెలిపారు. ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండి యూరియా ను అందించాలని ఆదేశించారు.