calender_icon.png 17 January, 2026 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ్మారంలో భగ్గుమన్న పాత కక్షలు

17-01-2026 03:11:50 AM

ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం                  

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఘటన

సూర్యాపేట, జనవరి 16 (విజయక్రాంతి) : పాత కక్షలు దృష్టిలో పెట్టు కొని ఒక వర్గం మరో వర్గంపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామంలో గడ్డం నర్సిరె డ్డి, సేనారెడ్డి వర్గాల మధ్య కొంతకాలంగా  ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇటీవల తమ్మారం సర్పంచ్‌గా హనుమయ్య గెలుపొందిన నేపథ్యంలో ఈ వివాదం మరింత తీవ్ర మైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హనుమయ్య వర్గానికి చెందిన సురాగాని మహేష్, తిమ్మిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడిచేసింది.

దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, శ్రీకాంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్న ట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు చింతలపాలెం ఎస్సై సందీప్ రెడ్డి తెలిపారు. ఘర్షణలో భాగస్వాములైన ఇతరులను సైతం గుర్తించను న్నట్లు తెలిపారు. అయితే  ప్రస్తుతం గ్రామంలో ఎటువం టి సంఘటనలు జరుగకుండా 25 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.