calender_icon.png 28 January, 2026 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం!

28-01-2026 12:37:10 AM

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాధవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గాంధీ టాక్స్’. క్యూరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ స్టూడియోస్ రూపొందించిన మూకీ సినిమా ఇది.

దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 30న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యం లో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎలాంటి డైలాగ్స్ లేవు. అయినా బలమైన దృశ్యాలు, భావోద్వేగంతో నిండిన నిశ్శబ్దం అన్నీ చాలా విషయాలను చెబుతున్నాయి.