12-09-2025 12:41:13 AM
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ముక్కోణ ప్రేమకథను టీజర్‌లో అందంగా చూపించారు. సిద్ధు పాత్ర రాశిఖన్నా, శ్రీనిధిశెట్టి పాత్రలతో కాంప్లెక్స్ రిలేషన్ ఆసక్తికరంగా ఉంది. ‘లవ్‌యూ2’ అనే ట్యాగ్‌లైన్ మరింత క్యూరిరియాసిటీని పెంచింది. సిద్ధు జొన్నలగడ్డ ఇందులో ‘డీజే టిల్లు’ పాత్రకు భిన్నంగా న్యూ ఛార్మింగ్ అవతార్‌లో కనిపించారు. చాలా స్టైలిష్‌గా ఆకట్టుకున్నారు. ఇద్దరు హీరోయిన్లతో కెమిస్ట్రీ చాలా కొత్తగా ఉంది.
రాశిఖన్నా ట్రెడిషినల్ మోడరన్ లుక్స్‌లో కనిపిస్తుంది. శ్రీనిధిశెట్టి పాత్ర కూడా కట్టిపడేసింది. సిద్ధు ఫ్రెండ్‌గా వైవా హర్ష తనదనై హ్యుమర్‌తో ఆకట్టుకున్నారు. మొత్తంగా టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది.
యూత్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా ఉండే రొమాంటిక్ డ్రామాను ఫ్రెష్ నరేటివ్ లవ్ ట్రయాంగిల్ టచ్‌తో చూపించబోతుందనే హింట్ ఇస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: జ్ఞానశేఖర్ వీఎస్; ఎడిటర్: నవీన్ నూలి; నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్; రచనాదర్శకత్వం: నీరజ కోన.