calender_icon.png 30 January, 2026 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజు 7,403 నామినేషన్లు

30-01-2026 12:48:40 AM

నేటితో ముగియనున్న గడువు 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని 116 మున్సిపల్, 7 కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగతున్నది. శుక్రవారం గడువు ముగియనుం డడంతో గురువారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 2,996 వార్డులకు రెండో రోజు 7,080 మంది అభ్యర్థులు 7,403 నామినేషన్లు వేశారు. దీంతో బుధ, గురువారాల్లో మొత్తం 7,970 మంది అభ్యర్థులకు గాను 8,305 నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్లు వేయడానికి చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్‌పీ, ఎంఐఎం, ఆమ్‌ఆద్మీ పార్టీతో పాటు స్వతంత్రులు, రిజిష్ట్రర్ పార్టీల నుంచి వేలాదిగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.