01-07-2025 12:02:25 AM
18 లీటర్ల నాటు సారా సీజ్
కల్వకుర్తి జూన్ 30 :కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో నాటుసారా నిర్మూలనలో భా గంగా ఆమనగల్ సర్కిల్ ఎక్సైజ్ పోలీసులు మరోసారి విజయవంతమైన దాడి నిర్వహించారు. వెల్దండ మండలం పోచమ్మ గడ్డ తం డ నుండి మాడుగుల మండలం కలకొండ గ్రామానికి ఆటోలో నాటు సారా రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 18 లీటర్ల నాటు సారాను సీజ్ చేసినట్లు ఆమనగల్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యనాథ్ చౌ హాన్ తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, న్యాయపరంగా విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని వారుహెచ్చరించారు.