10-08-2025 12:55:37 AM
మెదక్ జిల్లా ఘటన
మనోహరాబాద్, ఆగస్టు 9: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ కాళ్లకల్ సమీపంలో గల శ్రీరామ స్పిన్నింగ్ మిల్లులోని వాటర్ ట్యాంక్ గోడ కూలి ఒకరు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
మనోహరాబాద్ గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి బాల్‌రెడ్డి (45), కాళ్ళకల్ గ్రామానికి చెందిన ఎలక్ట్రిషన్ ఇద్దరు వాటర్ ట్యాంకులో నీళ్లు నింపుతుండగా గోడకూలి పోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని శవ పంచనామా జరిపి విచారణ చేపట్టారు.