calender_icon.png 10 August, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత యువతదే

10-08-2025 12:54:19 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి యువజన కాంగ్రెస్ సభ్యులు పోరాడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు కలుషితమై ఉన్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన గు రుతర బాధ్యత యువతపై ఉందని అన్నారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేట హుస్నాబాద్‌లోని పార్టీ ఆఫీసులో జరిగిన యూత్ కా ంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడా రు. 

దేశ రాజకీయాల్లో యువత పాత్ర ఉ ండాలని తొలిసారిగా రాజీవ్ గాంధీ 18 స ంవత్సరాలకే ఓటు హక్కు, 21 సంవత్సరాల కే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ క లుషితం అవుతోందని, దీనిని అధిగమించడానికి యువజన కాంగ్రెస్ చాలా శ్ర మించాల్సి ఉంటుందన్నారు.

స్వాతంత్య్ర ఉ ద్యమంలో తాము పోరాడకపోవచ్చు కానీ, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో యువజన కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్యుఐ రెండు కళ్లలాంటివని, భవిష్యత్ నాయకత్వంలో యువత భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.