calender_icon.png 9 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లయిన మూడు రోజులకే నూరేళ్లు

09-08-2025 12:00:00 AM

- రోడ్డు ప్రమాదంలో

- నవ వధువు అక్కడికక్కడే మృతి

- రెండు కుటుంబాల్లో విషాదం

తిమ్మాపూర్ ఆగస్టు 8, విజయ క్రాంతి: కాళ్ల పారాణి ఆరకముందే ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు అ క్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేం ద్రంలో చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ నవవధువు తిరిగి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ప్రమాదంలో నవ వ ధువు మృతి చెందడంతో రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే ఎల్ ఎం డి ఎస్త్స్ర శ్రీకాంత్ గౌడ్ కథనం మేర కు చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రా మానికి చెందిన ముద్దసాని అఖిల 22, జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన చి రుత రాజు,తో ఈనెల 6న వివాహం జరిగింది. కాగా శుక్రవారం కరీంనగర్ జిల్లా తి మ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో  పి జి ప్రవేశ రా సేందుకు  భర్త తోకలిసి టీఎస్ 13 ఈఎన్ 7063 గల ద్విచక్ర వాహనంపై వచ్చారు.

కా గా పరీక్ష ముగిసిన తర్వాత తిరిగి ఇంటికి వె ళ్తుండగా మహాత్మా నగర్ సమీపంలో గల రాజీవ్ రహదారి పై రేణిగుంట నుంచి కరీంనగర్ వెళ్తున్న  ఎంహెచ్ 34 బి జెడ్ 4445 గల లారీ వెనుక నుంచి ఢీకొనడంతో అఖిల తల నుజ్జు నుజై అక్కడికక్కడే మృతి చెం దింది. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాళ్లకు పారాణి ఆరక ముందే వివాహం జరిగి మూడు రోజులకే తన బిడ్డ మృతి చెందడంతో కుటుంబ స భ్యులు బోరున విలపించారు.అజాగ్రత్తగా లారీని నడిపి తన కూతురు మృతికి కారణమైన డ్రైవర్ సురేందర్ సింగ్ పై అఖిల తండ్రి నరసయ్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుఎస్త్స్రతెలిపారు.