18-08-2024 12:00:00 AM
కలెక్టర్‌కు లక్ష్మీపురం ప్రజల వినతి
నారాయణపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి): నారాయణపేట మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు జనార్ధన్‌రెడ్డి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది, గత నెల 29న పదోన్నతిపై కృష్ణా మండలం ముడుమాల్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లారు. జనార్ధన్‌రెడ్డిని తిరిగి తమ గ్రామానికి కేటాయించాలని కోరుతూ శనివారం అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం కలెక్టర్, డీఈవోను కలిసి విన్నవించారు. గ్రామంలోని బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచి, నాణ్యతగల బోధన చేసిన జనార్ధన్‌రెడ్డిని తిరిగి కేటాయించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిప్యుటేషన్‌పై లక్ష్మీపురానికి పంపించాలని కోరారు.