10-10-2025 12:26:27 AM
కామారెడ్డి, అక్టోబర్ 9 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన మాసుల నర్సింలు అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేదెలను మెపడానికి వెళ్తున్న అని ఇంట్లో చెప్పి వెళ్లినాడు.
రాత్రి సమయం అయినప్పటికి తిరిగి ఇంకా ఇంటికి రాకపోవడంతో అతని గురించి వారి కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ అతని గురించి ఎలాంటి ఆచూకీ లభించ లేదు. అతని భార్య లావణ్య గురువారం దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేర కు దోమకొండ ఎస్‌ఐ స్రవంతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.