17-08-2024 10:50:50 AM
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కుటుంబ కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.