calender_icon.png 22 August, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

22-08-2025 01:46:14 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 21, (విజయ క్రాంతి):ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. గురువారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని మందులు అందించే గది, రక్త పరీక్ష కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డ్ గర్భిణీ స్త్రీల వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ ను పరిశీలించారు.

ఇన్ పేషెంట్ వార్డ్ లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషెంట్ వివరాలు, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు.

కుక్క కాటు ఇచ్చే వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని,, ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు., ఔషధ నిల్వలు స్టాక్ పె ట్టుకోవాలన్నారు. ఈ తనిఖీలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రాధా మోహన్, డ్యూటీ డాక్టర్లు  సిబ్బందిపాల్గొన్నారు.