calender_icon.png 22 August, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ రేట్ల సరళీకరణ హర్షణీయం

22-08-2025 01:45:50 AM

  1. ప్రజలపై పన్నుభారం తగ్గించడం మంచిదే..
  2. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

 హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాం తి): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ రేట్ల సరళీకరణ నిర్ణయం హర్షణీయమని, ప్రజలపై పన్నుభారం తగ్గించడాన్ని స్వాగతిస్తు న్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో రాష్ట్రాలకు రావాల్సిన నిధులను సక్రమంగా పంపిణీ చేయాలని, పంపిణీ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు వాటా సక్రమంగా విడుదల కావడం లేదని ఆక్షేపించారు.

జీఎస్టీ కౌన్సిల్ గ్రూప్ మినిస్టర్స్,  జీఎస్టీ స్లాబ్స్ సవరణ, పన్ను రేట్ల లో మార్పులు, సిఫార్సులపై గురువారం న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సు లో భట్టివిక్రమార్క మాట్లాడారు. రాష్ట్రాల ఆ దాయాలు క్షీణించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన సమయం లో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14 శాతంగా ఉండేదని, ప్రస్తుతం ఆ రేటు కేవలం 8 శాతం మధ్యే ఉందన్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే రా ష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు, మౌలిక వసతుల కల్పన దెబ్బతింటాయని, దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాట క, త మిళనాడు కేంద్రప్రభుత్వానికి భారీగా ఆదా యం వచ్చేలా చేస్తున్నాయని, కానీ.. ఆ యా రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా సక్రమంగా అందడం లేదని వాపోయారు.