calender_icon.png 2 December, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న నామినేషన్లు..

02-12-2025 12:00:00 AM

మొయినాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : రెండో విడత నామినేషన్ లో పర్వం కొనసాగుతుంది. సోమవారం మండలంలోని  19 పంచాయితి లకు నామినేషన్‌లు వేసేందుకు   భారీగా అభ్యర్థులు తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఐదు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సమయం నిబంధన ప్రకారం ఉండగా ఐదు గంటలలోపు నామినేషన్ కేంద్రాలకు వచ్చి న అభ్యర్థుల నుంచి రాత్రి వరకు నామినేషన్లను అధికారులు తీసుకున్నారు.

ఇంతకు ముందు నామినేషన్లు వేసేందుకు పలువురు అభ్యర్థులు తమ మద్దతు దారులతో భారీగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు. బాకారం గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని తాసిల్దార్ గౌతమ్ కుమార్ సందర్శించారు. బాకారం క్లస్టర్ వద్ద చర్యల తెలుసుకోవడం కోసం రాజేంద్రనగర్ డిసిపి యోగేష్ గౌతమ్ సందర్శించారు.