calender_icon.png 30 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో ఐదు రోజులే

30-12-2025 01:21:42 AM

2 నుంచి 7 వరకే అసెంబ్లీ సమావేశాలు

బీఏసీలో నిర్ణయం 

  1.   15 రోజులు పాటు సమావేశాలు నిర్వహించాలి 
  2. ‘పాలమూరు’పై ‘పవర్’ ప్రజెంటేషన్‌కు అనుమతి ఇవ్వాలి 
  3. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు 
  4.   20 రోజులు నిర్వహించాలన్న మంత్రి శ్రీధర్, బీజేపీ ఎల్పీ నేత
  5. ఉపాధి హామీ చట్టం, ఆర్టీసీ తదితర అంశాలపై చర్చించాలి 
  6. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 
  7. మరోసారి బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందాం 
  8. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ 

హైదరాబాద్, డిసెంబర్  29 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాలు జనవరి 7 వరకే నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ (బీఏసీ) కమిటీలో  నిర్ణయించారు. 15 రోజు లు పాటు సమావేశాలు నిర్వహించాలని, పాలమూరు- రంగారెడ్డిపై.. ‘పవర్’ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యే హరీశ్‌రావు పట్టుపట్టారు. 20 రోజు లు  నిర్వహించాలని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. మరో సారి బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలి పారు.

శాసన సభ వాయిదా పడిన అనంతరం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమా ర్ అధ్యక్షతన సోమవారం తన ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీ లో అసెంబ్లీ పనిదినాల ఎజెండాపై చర్చించారు. జనవరి 2, 3, 5, 6, 7 తేదీల్లో (ఐదు రోజుల పాటు) సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారంతో కలిపి మొత్తం ఆరు రోజులు మాత్రమే శీతకాల సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశా లు 15 రోజుల వరకు జరపాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు బీఏసీలో పట్టుపట్టారు.

శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల వరకు నిర్వహించాలని స్పీకర్‌ను కోరినట్లుగా తెలిసింది. 32 అంశాలపై చర్చించా లని మహేశ్వర్‌రెడ్డి, 10 రోజుల వరకు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ప్రస్తుతం జనవరి 7వ తేదీ వరకు నిర్వహించాక.. ఆ తర్వాత మ రోసారి బీఏసీ సమావేశంలో ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ గడ్డం ప్ర సాద్‌కుమార్ చెప్పినట్లు తెలిసింది.

ఈ బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మ ధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లుగా తెలిసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హరీశ్ రావు స్పీకర్‌ను కోరగా.. ఆలోచించి నిర్ణ యం తీసుకుంటామని స్పీకర్ సమాధానమిచ్చినట్లుగా తెలిసింది. బీఆర్‌ఎస్ హ యాం లో కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని, అప్పు డు తాము సభను బహిష్కరించినట్లు  డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేసినట్లు తెలిసింది.

‘ఇప్పుడు మాకు పీపీటీకి అవకా శం ఇవ్వకపోతే మేము అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కట్  చేయాలా..? అని హ రీశ్ రావు అడిగినట్లుగా తెలిసింది. ఉపాధి హా మీ చట్టం రద్దు, సిగాచి కంపెనీలో పేలుడు, సింగరేణి, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించాలని కోరారు.

ఈ బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్‌లు బీర్ల ఐల య్య, ఆది శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎం ఐఎంఎల్పీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసన మండలి, అసెం బ్లీ కార్యదర్శులు నరసింహాచార్యులు, తిరుపతి పాల్గొన్నారు.