calender_icon.png 11 January, 2026 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాను నిలబెట్టేది మౌత్ టాక్ మాత్రమే

10-01-2026 02:04:18 AM

స్టార్ హీరో శర్వా, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

చిన్నప్పట్నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగా. ఇప్పుడు దర్శకుడిగా తొలిసారి సంక్రాంతికి నా సినిమా రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది పండగ లాంటి సినిమానే. అయితే, శర్వా బైకర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో మాకు సంక్రాంతికి వచ్చే మంచి అవకాశం దొరికింది. అంతేకాక -శర్వా ‘బైకర్’ కోసం చాలా కొత్తగా మేకోవర్ అయ్యారు. అది మాకు కలిసి వచ్చింది. మేము ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, తర్వాత ప్రెసెంట్ సీన్స్ చేశాం. ఆ రెండిటికీ పర్ఫెక్ట్‌గా లుక్ సెట్ అయింది. శర్వా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు అదరగొట్టేస్తారు. ఇందులో చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. 

ఈ సినిమాకు బాలకృష్ణ క్లాసిక్ టైటిల్‌ను వాడుకున్నాం. అంతే తప్పా, ఆ సినిమాకు, ఈ చిత్రానికి మరో పోలిక లేదు. టైటిల్ కూడా బాలకృష్ణ చేతుల మీదుగానే లాంచ్ చేశాం. 

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరిని అలరించడం ఇష్టం. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి అంటే ముక్కోణ ప్రేమకథ అన్న భావన కలుగుతుంది. కానీ ఇందులో చాలా కొత్త పాయింట్ ఉంది. సామజవరగమన ట్రైలర్‌లో అసలు కాన్‌ఫ్లిక్ట్ మేము రివిల్ చేయలేదు. ఇంటర్వెల్ దగ్గర అది వస్తుంది. ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాలో కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. అదేంటో బిగ్‌స్క్రీన్‌పై చూడాల్సిందే. క్లైమాక్స్ దగ్గర చాలా మంచి ఎమోషన్ వర్కౌట్ అయింది. 

సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సినిమా బాగుందని చెప్పే మౌత్ టాక్ సినిమాను బలంగా నిలబెడుతుంది. ‘సామజవరగమన’ అలానే విజయవంతమై యింది. -ఈ సినిమాలో ఒక మంచి కామియో రోల్ వుంది. శ్రీవిష్ణు అడిగిన వెంటనే చేశారు. నా తర్వాతి సినిమా శ్రీవిష్ణుతో చేస్తున్నా. అది క్రైమ్ కామెడీ జోనర్. 

ప్రతి ఒక్కరూ డైరెక్టర్ అవ్వాలని వస్తారు. కాకపోతే కొంతమంది రైటర్‌గా కొన్నాళ్లు నిలబడి తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గానే వచ్చా. గుణశేఖర్ ‘నిప్పు’ సినిమాకు ఏడీగా పనిచేశా. తర్వాత  అనుభవం గడించి డైరెక్టర్‌నయ్యా. ప్రస్తుతం ఇండస్ట్రీలో రచయితల కొరత ఉంది.