calender_icon.png 11 January, 2026 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన నాయగన్‌పై స్టే

10-01-2026 02:02:06 AM

దళపతి విజయ్ చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్ధం వీడటంలేదు. ఈ సినిమాను గత డిసెంబర్‌లో సెన్సార్ కోసం పంపగా అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయాలని సూచించింది. ఆ మేరకు మార్పులు చేసిన చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ మళ్లీ సెన్సార్‌కు పంపింది. అయితే, మార్పుల అనంతరం రెండోసారి పంపినప్పుడు బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో చిత్ర నిర్మాతల తరఫున మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ఈ నెల 9న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ అంశంపై హై కోర్టు సింగిల్ జడ్జి శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించా రు. ఈ సినిమాకు ముందుగా ఇస్తామన్న యూ/ఏ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు.. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణ కోసం రిట్ పిటిషన్ దాఖ లు చేసింది. దీంతో కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. విజయ్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది.