calender_icon.png 15 July, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో సీఎంఆర్ షాపింగ్‌మాల్ ప్రారంభం

10-08-2024 01:26:49 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపా ర సంస్థ సీఎంఆర్ గ్రూప్ తన 32వ బ్రాంచ్‌ను కరీంనగర్‌లోని మార్కెట్ రోడ్‌లో శుక్రవారం భూంరెడ్డి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ భూంరెడ్డితో వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చల్మెడ నరసింహరావు, వీ సూర్యనారాయణ, వీ రమాదేవి తదితరులు హాజరయ్యారు. కరీంనగర్ ఆర్యవైశ్య కేంద్రం అధ్యక్షు డు చిదుర సురేశ్ మొదటి కొనుగోలు చేశారు.

సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమ ణ మాట్లాడుతూ తమ సంస్థను గత 40 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అదరిస్తున్నారని, తమ 32వ బ్రాంచ్‌ను కరీంనగర్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ సినీ తారలు పాయల్ రాజ్‌పుత్, సంయుక్త మీన న్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆటపాట లు, డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు.