19-05-2025 09:04:16 PM
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పులిమడుగు గ్రామపంచాయతీకి చెందిన నిరుద్యోగ యువకుడు తనకు రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్(MPDO N Rajeshwar) కు వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పులిమడుగు గ్రామానికి చెందిన చందు అనే యువకుడు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాదిత యువకుడు మాట్లాడుతూ తమది అత్యంత నిరుపేద కుటుంబం అని ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నానని తనకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే స్వయం ఉపాధి పొందుతానని తనకు రుణం మంజూరు చేసి ఉపాధి కల్పించాలని కోరారు.