17-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, నవంబర్ 16(విజయక్రాంతి): జిల్లాలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన అప్పన్నపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో శ్రీరామ రక్షా స్తోత్రశ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రాంతం ఆధ్యాత్మికతకు నిలయంగా నిలుస్తోందన్నారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభివృద్ధితో ఉండాలని శ్రీ అభయాంజనేయ స్వామి వద్ద ప్రార్థిస్తున్నాన్నారు. ఈ మహాయజ్ఞం ప్రత్యేకతగా మొత్తం 1116 దంపతులు ఏకస్వరంతో పారాయణంలో పాల్గొనడం విశేషం అని, సామాజిక ఐక్యత, సౌభ్రా తృత్వం, శాంతిసమృద్ధి వంటి విలువలకు బలాన్నిస్తూ ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచిందని ఎమ్మెల్యే ప్రశంసించారు.
ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, రామాంజనేయులు, శ్రీను, నిర్వాహకులు కొత్తూరు శ్రీనివాస్‌రెడ్డి, వావిళ్ల రామిరెడ్డి, హేమసుందర మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, సంస్కృత పండితులు నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.
పేద వైద్య విద్యార్థినికి విద్యానిధి చెక్కు అందజేత
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 16: విద్యాభివృద్ధికి నిరంతరం చేత అందించడం జరుగుతుంది ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలో మంచన్పల్లి తండా కు చెందిన కడావత్ రాజేశ్వరి చెవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల లో ఎంబీబీఎస్ సీటు సాధించిన నేపథ్యంలో విద్యా సహాయార్థం రూ. 25 వేల చెక్కును విద్యానిధి నుంచి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.