calender_icon.png 5 December, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచివారికే మా ఓటు..!

05-12-2025 12:00:00 AM

  1. అందుబాటులో ఉండాలి.. అభివృద్ధి చేయాలి

ప్రజా సమస్యలపై అవగాహన అవసరం

సమర్థులైన వారికే మద్దతు

సర్పంచ్ అభ్యర్థులపై పల్లె ఓటర్ల చర్చ

సంగారెడ్డి, డిసెంబర్ 4(విజయక్రాంతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. తొలివిడత నామినేషన్ల పర్వం ముగియడంతో పోటీకి అర్హులైన జా బితాను అధికారులు ప్రకటించారు. మరోవైపు రెండో విడత పూర్తయి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

దీంతో గ్రామాల్లో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులంతా ఓటర్లను ప్రస న్నం చేసుకునే పనిలో నిమగ్నం కాగా, ఇటు ఓటర్లు సైతం వారిలో ఎవరికి ఓటు వేయాలనే దిశగా ఆలోచిస్తున్నారు. సర్పంచుగా ఎవరైతే తమ గ్రామానికి మేలు జరుగుతుందని చర్చించుకుంటున్నారు. దీంతో పల్లెపోరు ఆసక్తికరంగా మారింది.

ఇలాంటి వారికే ప్రాధాన్యత....

ప్రధాన పార్టీల మద్దతుతో నిలిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులుగా పోటీ చేస్తున్న వారి అంశాలను ఓటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. గ్రామ సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారా.. సామాజిక సేవాభావం ఉందా.. పల్లె పాలనను నిర్వహించ గలిగే సత్తా ఉందా.. సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారితో చర్చించగి లిగే పరిజ్ఞానం కలిగి ఉన్నారా... విద్యావంతులేనా ఇలా పలు అంశాలను పరిశీలిస్తున్నా రు.

అలాగే ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ వంటి ఇతర ప్రజాప్రతినిధుల నుంచి నిధులను రాబట్టగలిగే నేర్పరితనం ఉందా.. ము ఖ్యంగా ఎన్నికల వరకు గ్రామా ల్లో ఉండి.. గెలుపొందాక పట్టణాలకు మ కాం మార్చే ఆలోచన ఉందా.. వంటి అంశాలను పరిశీలిస్తున్న ఓటర్లు అందుబాటులో ఉండి అభి వృద్దికి పాటుపడే లక్షణాలు కలిగిన వారికి మద్దతునిచ్చేందుకుసిద్ధమవున్నారు.

గాడి తప్పిన పల్లెపాలన..

పల్లెల్లో సర్పంచుల పాలన లేక దాదాపు రెండేళ్లవుతోంది. ప్రత్యేకాధికారిని నియమించినా వారు అంతగా దృష్టి సారించలేదు. ఏడాదిలో రెండు, మూడుసార్లు కూడా గ్రామాలవైపు చూడని అధికారులు ఎంతో మంది ఉన్నారు. దీంతో కార్యదర్శులే పాలన బాధ్యతలు మోయాల్సి వస్తోంది. ఇలా పల్లెపాలన గాడి తప్పింది. అలాగే నిధుల కొరతతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కొత్తగా వచ్చే సర్పంచులపై ఉండగా, ప్రజలు కూడా సమర్థులకే పట్టం కట్టాలనిభావిస్తున్నారు.