calender_icon.png 27 September, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్‌ను మెప్పించే ఓజీ

26-09-2025 12:19:21 AM

సినిమా రివ్యూ

ఓజీ

నటీనటులు: పవన్‌కల్యాణ్, మాళవిక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్‌రాజ్ తదితరులు

ఛాయాగ్రహణం: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస

సంగీతం: తమన్

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాత: డీవీవీ దానయ్య, కల్యాణ్ డీ

దర్శకత్వం: సుజిత్

విడుదల: 25 సెప్టెంబర్ 2025

విడుదలకు ముందే బాగా క్రేజ్‌ను సంపాదించుకున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. అలా ప్రీమియర్స్‌తోనే వందకోట్ల వసూళ్లను రాబట్టింది. గురువారం నుంచి అసలు షోలు ప్రారంభయ్యాయి. ఈ సినిమాను సమీక్షిస్తే.. 

కథ 1990ల్లో ముంబైలో జరుగుతుంది. సత్యదాదా (ప్రకాశ్‌రాజ్) ముంబైలోని ఓ షిప్ యార్డ్‌కు అధినేత. సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి. తన షిప్ యార్డ్‌లో వచ్చిన ఆగిన ఓ కంటైనర్ నిండా ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ ఉన్న విషయాన్ని తెలుసు కుంటాడు సత్యదాదా. అది విద్రోహుల చేతి కి చిక్కితే దేశానికే ప్రమాదమని భావిస్తాడు. రహస్యంగా దాచేస్తాడు. తన కంటైనర్ సత్యదాదా పోర్ట్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసి ముంబయి చేరుకుంటాడు గ్యాంగ్‌స్టర్ ఓమీ (ఇమ్రాన్ హష్మీ).

దాదా మనుషుల్ని వేటాడుతూ హింసిస్తుంటాడు.ఎన్నో కుటుంబాలకు జీవనాధార మవుతుందన్న సదు ద్దేశంతో తాను స్థాపించిన పోర్ట్ ఓమీ కారణంగా నాశనమయ్యేలా పరిస్థితి వచ్చిందని సత్యదాదాకు అర్థమవుతుంది. ఓమీ నుంచి రక్షించేది ఓజీ (పవన్ కల్యాణ్) ఒక్కడేనని భావిస్తాడు. కానీ, ఓజీ 15 ఏళ్ల క్రితమే ముంబయికి దూరంగా ఉంటున్నాడు. అతను ముంబయికి ఎందు కు వీడాల్సి వచ్చింది? అసలు ఓజీ నేపథ్యం ఏంటి? అన్నదే మిగతా కథ. 

ఇక ఎలా ఉందంటే.. ఇది పూర్తిగా దర్శకుడి సినిమానే. పవన్‌కల్యాణ్ అభిమాని అయిన సుజిత్‌కు ఆయన్ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. తన అభిమాన హీరోను తెరపై తన కళ్లతో ఎలా చూడాలనుకున్నాడో అలా చూపెట్టాడు. పవన్ వన్ మేన్ షో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ గాడి తప్పిం ది. సామాన్య ప్రేక్షకులను కథ గందరగోళానికి గురిచేస్తుంది. పవన్ ఎలివేషన్స్ అతిగా అనిపిస్తాయి. సింహభాగం సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయి. 

యాక్షన్ సన్నివేశాల్లో ఆయుధాలతో బంతాటాడుకునే పవన్‌కల్యాణ్.. ఓజాస్ గంభీరగా మరింత రెచ్చిపోయారు. కణ్మ ని పాత్రలో ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించింది కొద్దిసేపే అయినా ఒదిగిపోయింది. ప్రకాశ్‌రాజ్‌ది రెగ్యూలర్ పాత్రే. ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మీ ఆకట్టుకున్నారు. మిగతా నటీ నటులు తమ పరిధి మేరకు నటించారు. 

సాంకేతిక అంశాల విషయానికొస్తే.. ఈ సినిమాకు అసలు హీరోలు సుజిత్, తమన్. ఇది రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో కొత్తగా మాలిశాడు దర్శకుడు సుజిత్. తమన్ ఆర్‌ఆర్ దద్దరిల్లిపోయంది. కెమెరా, ఎడిటింగ్ చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, కథలో గందరగోళం.. ఎలివేషన్స్‌లో గాంభీర్యం కనిపిస్తుంది. మాస్‌ను మెచ్చేవాళ్లు ఇష్టపడే సినిమా ఇది.