07-04-2025 12:23:09 AM
మేడ్చల్, ఏప్రిల్ 6(విజయ క్రాంతి): ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో బొలె రో వాహనంలో భారీగా గంజాయి తరలిస్తుండగా, ఎస్ ఓ టి, షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో ఇంటి సామాన్ల మధ్యలో 273 కిలోల గంజాయి పట్టుబడింది.
బొలెరో వా హనం యజమాని పంజాబ్ కు చెందిన ప్రదీప్ కుమార్, హర్యానా కు చెందిన డ్రైవర్ సన్నీ, హెల్పర్ మనీష్ కుమార్, సో హెల్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశాలో సుభాష్ విశ్వాస వద్ద ఎండు గంజాయి తీసుకొని హ ర్యానాకు తరలిస్తూ పట్టుబడ్డారు. ప్రదీప్ కుమార్, సన్నీ, మనీష్ కుమార్ పట్టుబడగా, సోహైల్, సుభాష్ బిస్వాస్ పరారీలో ఉన్నా రు. డ్రైవర్ సన్నీ పై పాత కేసులు కూడా ఉన్నాయి.
పోలీసుల మీద ఎదురు దాడి, ఆయుధ చట్టం కింద, 307 సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. సోహెల్ గతంలో గంజా యి తరలిస్తూ సెంట్రల్ నార్కోటిక్ టీమ్ కు పట్టుబడి జైలుకెళ్లాడు. కోర్టులో అప్పులు చేసుకొని బెయిల్ మీద బయటికి వచ్చాడు.
బయటికి వచ్చిన తర్వాత కూడా గంజాయి తరలిస్తున్నాడు. నిందితుల వద్ద కోటి లక్ష రూపాయల విలువైన గంజాయి, బొలెరో వాహనం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పట్టుకున్న ఎస్‌ఓటి, షా మీర్పేట్ పోలీసులను డిసిపి అభినందించారు.
గంజాయి హైదరాబాద్‌కు తరలింపు
ఒడిస్సా నుంచి గంజాయి పెద్ద మొత్తంలో ప్రతిరోజు హైదరాబాదుకు తరలిస్తున్నారు. హైదరాబాదులో గంజాయి విని యోగం ఎక్కువగా ఉంది. విచ్చలవిడిగా అ మ్మకాలు సాగుతున్నాయి. ఒడిశా నుంచి హ ర్యానాకు తరలిస్తుండగా శామీర్పేట వద్ద ప ట్టుకున్నామని డిసిపి కోటిరెడ్డి వెల్లడించినప్పటికీ, అది హైదరాబాద్ కి తరలిస్తున్నారని తెలుస్తోంది.
ఒడిశా నుంచి హర్యానా వెళ్లాలంటే తెలంగాణకు రావలసిన అవసరం లే దు. అంతేగాక నిందితులు హైదరాబాదులో ని బోయిన్పల్లి లో ఉంటున్నారు. దీనిని బట్టి హైదరాబాద్ కే తరలి స్తున్నట్టు తెలుస్తోంది.