calender_icon.png 2 May, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టికెట్ చార్జీలో 10% రాయితీ

02-05-2025 01:53:21 AM

నిజామాబాద్, మే 1 (విజయ క్రాంతి): నిజామాబాద్ నుండి వరంగల్ డీలక్స్ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిజామాబాద్ నుండి వరంగల్ రూట్ లో డీలక్స్ బస్సు లో ప్రయాణించే ప్రయాణికులకు బేసిక్ టికెట్ ఛార్జ్ పై 10% రాయితీని ఆర్టీసీ ప్రకటించింది ఈ రాయితీ డీలక్స్ బస్సులకు వర్తిస్తుందని నిజామా బాద్ రీజినల్ మేనేజర్ టి జోష్నా తెలిపారు ప్రయాణికులకు ఉన్నతస్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి ఉంచడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రయాణికులకు ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్టు ఆమె తెలిపారు.

ప్రయాణికులు అందరూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కల్పించిన ఈ అవకాశాన్ని రాయి తీని ఉపయోగించుకొని టికెట్ పై 10 శాతం తగ్గింపు చార్జీలతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని జోష్ణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. అధిక సంఖ్యలో ప్రయాణికులు డీలక్స్ బస్సులలో ప్రయాణించి టిక్పె పది శాతం తగ్గింపు పొంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి సహకరించాలని జోత్స్న ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు