14-05-2025 12:00:00 AM
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): ఆదంపూర్‌లోని ఎయిర్ బేస్‌ను, ఎస్-400ను ధ్వంసం చేశామని అబద్ధపు ప్రచారంతో పోరాటం చేసిన పాకిస్థాన్ తీరును ప్రధాని మోదీ ప్రపంచం ముందు ఎండగట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ లో మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్‌లో ప్రధాని మోదీ మాస్టర్ క్లాస్ చూపించారని పేర్కొన్నారు. హీరోలైన మన సైనికులు, ఎస్-400, ఎయిర్ బేస్ వద్ద మోదీ నిలువెత్తు రూపం ప్రపంచానికి ఇప్పుడు స్పష్టంగా కనిపించిందన్నారు. వన్ ఫ్రేమ్.. జీరో డౌట్స్.. అబద్ధాలన్నీ పటాపంచలైపోయాయని ఆయన పేర్కొన్నారు.
ఆదంపూర్‌లో సైనికులతో మోదీ విజువల్స్ పాకిస్థాన్‌కు సరైన సమాధానమన్నారు. మన సైనికులు షోపియాన్‌లో ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాదులను మంగళవారం హతం చేయడమే కాకుండా ఇంకో ఉగ్రవాది కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు.