21-01-2026 01:01:23 AM
హైదరాబాద్, జనవరి 20: అంగవైకల్యం ఎవరి ప్రతిభకు అడ్డుకాదని పారా స్కైడైవర్ సాయిప్రసాద్ విశ్వనాథన్ అన్నారు. శారీరక వైకల్యం, వృద్ధాప్యం, అనారోగ్యంతో బయటకు వెళ్లలేని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో మెబిలిటీ లింక్ సంస్థ కొత్త రూపొందించిన డిగ్నీ మూవ్ వినూత్న సేవలను ఆయన ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి ప్రీమియర్ లగ్జరీ సహాయ రవాణా వ్యవస్థను తీసుకురావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంగవైకల్యం వెంటాడినా సాహసయాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విశ్వనాథన్ డిగ్నీమూవ్ సేవలు తీసుకొచ్చిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అంగవైకల్యం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడే వారి వైద్య అవసరాల కోసం దీనిని ప్రారంభించినట్టు డిగ్నీ మూవ్ ఎండి వెంకటరమణ ప్రసాద్ చెప్పారు.