calender_icon.png 21 January, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా అథ్లెట్లకు అండగా సానియా

21-01-2026 01:03:39 AM

ది నెక్స్ సెట్ ప్రారంభించిన టెన్నిస్ స్టార్

హైదరాబాద్, జనవరి 20: భారత టెన్నిస్‌లో పలు అద్భుత విజయాలు సాధించి యంగ్ ప్లేయర్స్‌కు స్ఫూర్తిగా నిలిచిన సానియా మీర్జా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తనకు ఎంతో ఇచ్చిన ఆటకు తిరిగి ఇవ్వాలన్న లక్ష్యంతో ది నెక్స్ సెట్ ప్రారంభించింది. దీని ద్వారా క్రీడల్లో రాణిస్తున్న మహిళా అథ్లెట్లకు అండగా నిలవబోతోంది. వాళ్లకి మెంటార్‌గా బాధ్యతలు తీసుకోబోతోంది. ఆట పరంగానే కాకుండా మానసికంగానూ మహిళా అథ్లెట్లకు భరోసా ఇవ్వడానికే దీనిని ప్రారంభించినట్టు సానియా మీర్జా తెలిపింది.దీనిలో భాగంగా సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయనుంది. ఆటలో సాంకేతిక అంశాలు, మానసిక, శారీరక విషయాలకు సంబంధించి మహిళా అథ్లెట్లకు మద్ధతు ఇవ్వనున్నట్టు సానియా వెల్లడించింది.