15-08-2025 12:52:53 AM
కొత్తపల్లి, ఆగష్టు 14 (విజయక్రాంతి) : రేకుర్తిలోని స్థానిక పారడైజ్ పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం అతి పొడవైన 1,000 మీటర్ల జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని రేకుర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వర్ హాజరై ర్యాలీని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి దేశభక్తి కలిగి ఉండాలని ఉత్తమ పౌరులుగా దేశానికి సేవలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తదుపరి పాఠశాల చైర్మన్ డాక్టర్ పి. ఫాతిమారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపుమేరకు “హర్ ఘర్ తిరంగా” వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ టీ. వసంత, వైస్ ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.