calender_icon.png 22 November, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రత్నాపూర్ మాజీ సర్పంచ్ బొగె లింగయ్య గుండెపోటుతో మృతి

17-08-2024 11:45:00 AM

మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బోగె లింగయ్య శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. మాజీ సర్పంచ్ మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. లింగయ్య పార్థీవ దేహానికి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య, మండల అధ్యక్షుడు రొడ్డ బాపుతో పాటు పలువురు నివాళులు అర్పించారు.