28-07-2025 12:49:03 AM
కొత్తపల్లి, జులై 27(విజయక్రాంతి):కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్థానిక బీజేపీ నేతలు మొరపెట్టుకున్నారు. కొత్తపల్లిలో బీజేపీ సీనియర్ కార్యకర్త మహేందర్ తల్లి చనిపోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమా ర్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కొద్దిసేపు ము చ్చటించారు.
అనంతరం మాజీ మేయర్ సునీల్ రావుతో కలిసి కారులో తిరిగి వస్తుండగా బీజేపీ సీనియర్ నేత వాసాల రమేశ్, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, మాజీ కార్పొరేటర్ బండ రమణారెడ్డి ఎదురై కొత్తపల్లిలో రోడ్ల దుస్థితిని పరిశీలించాలని కోరారు. దీంతో వా రితో కలిసి బండి సంజయ్ గుంతలు పడి వర్షంతో నిండిన రోడ్లను పరిశీలించారు.
ఈ రోడ్లపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు తిరగలేని పరిస్థితి నెలకొందని తక్షణమే ఈ రోడ్లును బాగు చేయించాలని వాసాల రమేష్ కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మం త్రి బండి సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. అంతకుముందు చర్ల బూత్కూర్ లో బీజేపీ సీనియర్ కార్యకర్త రమణారెడ్డి తల్లి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిపరామర్శించారు.