15-05-2025 02:30:04 AM
మెదక్, మే 14(విజయ క్రాంతి): విద్యార్థుల ఆసక్తి ఆలోచనలకు అనుగుణంగా వా రు ఎన్నుకున్న రంగంలో విద్యను అభ్యసించేలా జీవన ప్రగతిని తల్లితండ్రులు ప్రోత్స హించాలని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సూచించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన స మావేశ మందిరంలో ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, సంబంధిత మం డల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, (SSC) - 2025లో ఉత్తమ ఫలితా లు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల సన్మాన సభ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను జిల్లా యంత్రాంగం తరపున ఎంతగానో అభినందించారు. జిల్లా విద్యాశాఖను విద్యార్థినీ విద్యార్థుల ఆలోచనలకు అభిరుచులకు అనుగుణంగా ఎంచుకున్న రంగాన్ని ప్రోత్సహిస్తూ వారి జీవన ప్రగతిపై ప్రణాళిక బద్ధం గా వ్యవహరించాలన్నారు.
చదువు అనేది వి జ్ఞతను, విజ్ఞానాన్ని ఇస్తుందని పిల్లలను ఎస్‌ఎస్సిలో సరిగా మార్కులు రాలేదని అవమా న పరిచే విధంగా తల్లిదండ్రులు మాట్లాడకూడదని, పిల్లల మానసిక సంఘర్షణకు లో ను కాకుండా చూసుకోవాలన్నారు.పదవ త రగతి పాసైన విద్యార్థినీ విద్యార్థులను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేవిధంగా జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చొరవ క్షేత్రస్థాయి లో సత్ఫలితాలనుస్తాయని చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరంలో నూరు శాతం ఫలితాలు లక్ష్యంగా మెతుకు సీమ జిల్లా కీర్తిని విద్యారంగంలో చాటి చెప్పాలని ఈ సందర్భంగా ఎంపీ అభివర్ణించారు. పది ఫలితా ల్లో ఉత్తమ మార్కులు సాధించిన (196 ) మంది విద్యార్థినీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో అలాగే (82 ) మంది పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్, ప్రత్యేక అధికారులను ప్రశంసాపత్రాలు అందించారు.
ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు, సంబంధిత సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
రైల్వేలైన్ పై మాట తప్పిన కాంగ్రెస్
మెదక్, మే14(విజయ క్రాంతి): మాజీ ప్ర ధాని ఇందిరా గాంధీ హయాంలో మెదక్ కు రైల్వే లైన్ ఇస్తామని హామీ ఇచ్చి తప్పితే బీజే పీ ప్రభుత్వం నెరవేర్చిందని మెదక్ ఎంపీ ర ఘునందన్ రావ్ అన్నారు.
బుధవారం నా డు మెదక్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పాల్గొన్న ఎంపీ ర ఘునందన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... మెదక్ రైల్వేస్టేషన్ కు నాటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో మాటా ఇస్తే 42 సంవత్సరాల కాలం తర్వాత బిజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ హ యాంలో మెదక్ పట్టణంకు రైల్వే స్టేషన్ ని ర్మాణం జరిగిందన్నారు.
ఈ ప్రాంత ప్రజల అవసరాల మేరకు మిర్జాపల్లి వరకు రైల్వే లై న్ ఏర్పాటు కొరకై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరతామన్నారు. చేగుంట రైల్వే గేటు వల్ల వాహనాలు నిలిచిపోయి ప్రజలకు దారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అందుకోసం కేంద్రం, రాష్ట్ర ప్రభు త్వం చెరో యాభై శాతం ఖర్చులతో ప్రజల ఇబ్బందులు తోలగించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆర్థిక శాఖను కోరితే ఏటువంటి సా యం చేయలేక చేతులెత్తేయడంతో కేంద్రం ద్రుష్టికి తీసుకొని వెళ్ళినామని రైల్వే గేటు కు అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందనీ అన్నారు.
మెదక్ పట్టణంకు ప్రస్తు తం వస్తున్న రైళ్ళ రాకపోకల సమయంలో మార్పులు చేర్పులు చేయాలని పట్టణ వా సుల కోరడం తో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడారు. కొద్ది రో జులలో సమయవేళలు మారుస్తామని హా మీ ఇచ్చారని ఎంపి తెలిపారు. అంతకు ముందు రైల్వేస్టేషన్ పనితీరును స్టేషన్ లో కలియ తిరిగారు. ఈ కార్యక్రమం బీజేపీ పా ర్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.