04-10-2025 12:00:00 AM
తాడ్వాయి, అక్టోబర్, 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఏండ్రియాల గ్రామంలో గురువారం రాష్ట్రీ య స్వయంసేవక్ సంఘ్ ఉత్సవాలు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహించారు. అంతకుముం దు ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థన చేశారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశంలోనే బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. వారి సేవలు మరువలేనివన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.