02-09-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 1,(విజయ క్రాంతి): భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ శాఖల అధికారులను కొత్తగూడెం శాసనసభ సభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆదేశించారు. హైదరాబాద్ ఉన్న సోమవారం మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్, పంచాయతి, పొలిసు, రెవెన్యూ తదితర జిల్లా, డివిజన్ అధికారులను ఆదేశించారు.
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలోని పలు గ్రామాలు, బస్తీల్లోని అంతర్గత రహదారులు దెబ్బ తిన్నాయని తక్షణమే పుననిర్మాణం చేపట్టి పరిస్థితిని చక్కదిద్దాలని, దిబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంబాలు ఏర్పాటు చేసి విద్యుత్తును పునరుద్దరించాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని, ప్రత్యేక డ్రైవులు చేపట్టి ప్రజలు జబ్బులబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అవసరైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్స అందించాలని ఇండ్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు కృషిచేస్తానని, ప్రభుత్వం ద్వారా పరిహారం చెల్లించేవిధంగా అదేవిధంగా పంటల నష్టంపై సర్వే చేపట్టి నష్ట అంచనాను ప్రభుత్వానికి నివేదించడం ద్వారా బాధితుల్ని పరిహారం అందేవిధంగా చొరవ తీసుకోవాలని సూచించారు. నిర్వాసితులుగా మరిన్ని కుటుంబాలని తక్షణమే పునరావాసి కేంద్రాలు ఏర్పాటు చేసి సకలసౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.