02-10-2025 12:00:00 AM
రూ.30 వేలు ఆర్థిక సహాయం
పాపన్నపేట, అక్టోబర్ 1 :దేవాదాయ ధర్మాదాయ శాఖలో విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్ళిన ఓ చిరు ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందడంతో ఆలయ అధికారులు దిగ్బ్రాంతి చెందారు. అందరితో కలుపు గొలుపుగా ఉండే స్వీపర్ నర్సింలు అకాల మృతి పలువురిని కలిచివేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అంత్యక్రియ నిమిత్తం రూ.30వేల ఆర్థిక సహాయం అందజేశారు.