calender_icon.png 2 October, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మి పంచండి.. జనంతో మమేకం అవ్వండి

02-10-2025 12:00:00 AM

  1. మండల స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టణ నాయకులు విస్తృతంగా పని చేయాలి
  2. హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందింది
  3. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, అక్టోబర్ 01 ( విజయక్రాంతి ) : విజయదశమి పండుగ సందర్బంగా జమ్మి పంచండి జనంతో మమేకం అవ్వండని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహంలో పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ బి.ఆర్.ఎస్ ముఖ్యనాయకుల సమావేశంకు ఆయన ముఖ్య అతి ధిగా హాజరై పలు సూచనలు చేశారు. 

రా బోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ నా యకులు కీలక పాత్ర పోషించి ప్రభుత్వ ప్ర జావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దసరా పండుగ సందర్భంగా ప్రతి గడపకు వెళ్ళి జమ్మి ఇచ్చి  ప్రజలతో మమేకమై నాటి కె.సి.ఆర్ సంక్షేమ పాలన నేటి విధ్వంస పాలన గూర్చి చర్చించాలన్నారు.

పండగ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం నాటి నుండి బకాయి పడ్డ రూ పాయలను బాకీ కార్డ్ ద్వారా వివరించాలని అన్నారు.పికాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం వేస్తే నిలదీయాలని బకాయిపడ్డ అప్పును ఇవ్వాలని అప్పుడే ఓట్లు వేస్తామని నిలదీయాలని ఆయన పిలుపు నిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో బి.ఆర్.ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మాజీ కౌన్సిలర్స్ ము ఖ్య నాయకులుపాల్గొన్నారు.