08-11-2025 12:00:00 AM
మల్కాజిగిరి, నవంబర్ 7(విజయక్రాంతి) : నేరెడ్‌మెట్ డివిజన్ పరిధిలోని దేవినగర్ కాలనీలో ప్రధాన దారి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నేపథ్యంలో స్థానికుల ఆవేదనపై మల్కాజిగిరి బీజేపీ నాయకుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి చొరవ తీసుకొని సీసీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మా ట్లాడుతూ కాలనీలో ఎక్కడైనా రోడ్లు, డ్రైన్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, దినేష్, సాయి, కిట్టు, సంజీవ్, రాజు పాల్గొన్నారు.