calender_icon.png 14 October, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లులను వెంటనే చెల్లించి ఆదుకోవాలి

13-10-2025 12:00:00 AM

ఆలేరు, అక్టోబర్ 12 (విజయ క్రాంతి): ఆలేరులో జరిగిన సమావేశంలో నష్టాల్లో కూరుకుపోయిన మదర్ డైరీ కి ప్రభుత్వం 70 కోట్లు గ్రాంటు ఇచ్చి ఆదుకోవాలని పాల రైతుల సంఘం నాయకులు బోళ్ళ కొండల్ రెడ్డి అన్నారు, పాలు పోస్తున్న రైతులకు 7 బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల రైతులు వారి కుటుంబాలను పోషించుకోవడం, పశుపోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో లీటర్ పాలకు నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ఉన్నదని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఐదు రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని అన్నారు ఐదు రూపాయల ఇన్సెంటివ్ వెంటనే రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందని డైరీ ఆస్తులను అమ్మాలని చూస్తున్నారని నష్టాలకు రైతులు కారణము కాదని పాలకవర్గాలు చేసిన తప్పిదాలే దీనికి కారణమని అన్నారు.

కష్టార్జితంతో ఆస్తులను కూడా పెట్టారని పాలకవర్గాలు అట్టి ఆస్తులపైన ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఈనెల 13న ఆలేరు పాలసీ తళీకరణ కేంద్రం లో జరిగే పాల రైతుల రౌండ్ టేబుల్ సమావేశం కు రైతులు రాజకీయ పక్షాలు రైతు సంఘాలు మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మంగ నరసింహులు, ఆర్ జనార్ధన్, కళ్లెపు అడువయ్య, ఇమ్మడి రాంరెడ్డి, చెక్క వెంకటేష్, రామ్ గోపాల్ రెడ్డి, కొలనుపాక పాల చైర్మన్ మామిడాల సోమయ్య, ఇక్కుర్తి పాల సంఘం చైర్మన్ రాజయ్య, గొట్టిపాముల రాజు తదితరులు పాల్గొన్నారు.