02-09-2025 12:25:18 AM
సిద్దిపేట క్రైమ్, సెప్టెంబర్ 1 : సిద్దిపేట శివారులోని బీజేఆర్ చౌరస్తా వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి దుర్మరణం చెందాడు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామా నికి చెందిన ఆకుల శశిధర్ (21) అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ద్విచక్ర వాహ నంపై వెళ్తూ, వేగం అదుపు తప్పి బీజేఆర్ చౌరస్తా వద్ద వాటర్ ఫౌంటెన్ లో బైక్ తో సహా పడిపోయాడు.
సోమవారం మధ్యా హ్న సమయంలో అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిబ్బం దితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.