calender_icon.png 26 July, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి

25-07-2025 12:55:29 AM

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఏటూరునాగారం,జూలై24(విజయక్రాంతి):ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని దొడ్ల,కొండాయి బ్రిడ్జి గోదావరి వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు గోదావరి ప్రభావం పెరిగింది ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులు కురుస్తున్న వర్షానికి గోదావరి వరద ఉదృత పొంగిందనీ,

తాత్కాలిక రోడ్డు కొట్టుకొని పోయిందని, కొండాయి గ్రామ ప్రజలకు నిత్యవసర సరుకులు,వైద్యాధికారులను అందుబాటులో ఉంచామని ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టామని అత్యవసర పనుల కోసం ఒక బోటును అందుబాటులో ఉంచామని,అదనంగా రెండు బోర్డులు ఈ రోజు తెప్పించడం జరుగుతుందని,గ్రామ ప్రజలకు సంబంధిత అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు.