24-07-2025 10:36:13 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మూసి ప్రాజెక్ట్‌కు ఎగువ నుండి నిరంతరంగా నీరు వచ్చి చేరుతున్నందున ఈ నెల 25 న ఉదయం 8 గంటలకు మూసి ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) గురువారం తెలిపారు. అందువల్ల మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ప్రస్తుతం మూసీ నదిలోకి 1427 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నదని, ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నీటిమట్టం 645.00 అడుగుల పూర్తి స్థాయికి బదులుగా, 643.00 అడుగుల వద్ద నిర్వహించడానికి గాను జూలై 25న ఉదయం 8:00 గంటలకు మూసి ప్రాజెక్ట్ క్రెస్ట్ గేట్లను ఎత్తి 1260 క్యూసెక్కుల నీటిని మూసి నదిలోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అందువల్ల నల్గొండ జిల్లాలలోని మూసి నది పొడవునా ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి మనుషులను, పశువులను పంపవద్దని కోరారు. ముఖ్యంగా జిల్లాలోని కేతేపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మండలాల పరిధిలోని బొప్పారం, కాసనగోడే, చీకటిగూడెం, కోత్తపేట, ఉప్పలపహాడ్, కొప్పోలె, భీమారం, అమంగల్, లక్ష్మీదేవి గూడెం, రావులపెం, రాజపేట, నర్సింహుల్ గూడ, తక్కెలపాడు, కల్వపల్లి, అలగడప రాయన్ పాలెం, ముల్కల్ కల్వ, కేశవాపూర్, తుంటుకుంట విల్ల, వాడపల్లి, వజీరాబాద్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.