calender_icon.png 8 August, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

20-07-2024 01:03:38 AM

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : పీజీఈసెట్ కౌన్సిలింగ్ షె డ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. శుక్ర వారం మాసబ్ ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో  తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబా ద్రి షెడ్యూల్ విడుదల చేశారు. పీజీఈఎస్ ద్వారా 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మ్, ఫార్మ్‌డీ  కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈనెల 30 నుంచి కౌన్సిలింగ్‌కు సం బంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఆగస్టు 12 నుంచి 14 వరకు వెబ్‌ఆప్షన్లు, ఆగస్టు 17న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 18 నుంచి 21వ తేదీ వరకు  రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.