01-07-2025 12:00:00 AM
పర్యావరణ పరిరక్షణను ప్రజలందరూ తమ సమిష్టి బాధ్యతగా భావించాలి. గ్రామాలు, పట్టణాలను పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. తమ వంతుగా తాము నివాసముండే పరిసరాలలో విధిగా మొక్కలు నాటాలి. ప్లాస్టిక్ కాలు ష్యాన్ని నివారించడానికి మళ్లీ బట్టల సంచుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ లేనప్పుడు ప్రజలు ఎలా బ్యాగులు వాడేవారో అలాంటి పరిస్థితిని మళ్లీ పునరుద్ధరించుకోవాల్సి ఉంది.
సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట