01-07-2025 12:00:00 AM
దేశంలో అడపాదడపా తొక్కిసలాట సంఘటనలు జరుగుతు న్నా అధికారులకు ఇంకా కనువిప్పు కలగక పోవడం దురదృష్టకరం. ఒడిషాలోని గుండిచా దేవాలయంలో పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందడమేకాక యాభై మంది వరకు గాయాల పాలు కావడం అత్యంత బాధాకరం. జనం అధిక సంఖ్యలో గుమిగూడే సందర్భం వచ్చినప్పుడు సంబంధిత అధికారులు ఎందుకు అప్రమత్తం కావడం లేదో అర్థం కాదు. ఒడిషా ముఖ్యమంత్రి భక్తులకు క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?
సహర్ష, ఓల్డ్ ఆల్వాల్, సికిందరాబాద్