calender_icon.png 17 January, 2026 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం, కాలె యాదయ్య బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే

17-01-2026 02:53:40 AM

  1. అనర్హత పిటిషన్‌ను కొట్టివేసిన అసెంబ్లీ స్పీకర్  
  2. ఇప్పటికి ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ 
  3. ఇంకా ముగ్గురిపై నిర్ణయం తీసుకోని స్పీకర్ 

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయిం చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య బీఆర్‌ఎస్‌లోనే ఉన్న ట్టు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, వీరిపై న అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు.

కాగా ఇవే ఆరోప ణలు ఎదుర్కొంటున్న మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకా ష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్ గతంలోనే తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పోచా రం శ్రీనివాస్ రెడ్డి, కాలేయాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా ఏడుగురికి క్లిన్ చిట్ ఇచ్చారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఇంకా విచారణ జరగాల్సి ఉంది. మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విషయంలో విచారణ జరిగినప్పటికి తీర్పును రిజర్వులో పెట్టారు.