calender_icon.png 17 January, 2026 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ 19న మోడల్ స్కూళ్ల ప్రవేశపరీక్ష

17-01-2026 02:51:29 AM

ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 19న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతి ప్రవేశాలు, 7 నుంచి 10 తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.