calender_icon.png 3 September, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితా సంపుటి ఆవిష్కరణ

01-09-2025 01:43:46 AM

కరీంనగర్‌లోని కార్ఖానా గడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వారా ల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ (మూడు పం క్తుల కవిత్వం) కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం  జరుగనున్నది. ముఖ్యఅతిథిగా ఉపాధ్యాయుడు ఉడుత రాజేశం విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్, పోయెట్రీ ఫోరం ప్రతినిధి ఇందిరారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 

సింగిల్ పేజీ  కథల పోటీ

సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో వంశీ ఆర్ట్ థియేటర్స్ 54వ వార్షికో త్సవం సందర్భంగా నిర్వాహకులు సింగిల్ పేజీ కథల పోటీలకు కథలను ఆహ్వానిస్తున్నా రు. విజేతలకు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు నగదు బహుమతులు అందజేస్తారు. మరికొంతమందికి రూ. వెయ్యి చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు.

కథకులు సామాజిక అంశాలను స్పృశించే విధంగా కథ రాయాలి. ఆ కథ ఈ పోటీ కోసమే రాసిందై ఉండాలి. కథ డీటీపీ ఫార్మెట్‌లో ఫాంట్ సైజ్ 16తో ఏ4 సైజు పేపర్ మించకుండా ఉండాలి. నిర్వాహకులు బహుమతి పొందిన నాలుగు కథల పాటు పోటీకి వచ్చిన మరికొన్ని కథలను కలిపి ఒక పుస్తక సంకలనంగా ప్రచురిస్తారు. కథకులు సెప్టెంబర్ 30వ తేదీలోపు తమ కథలను కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు.

చిరునామా: పొట్లూరి సుబ్బారావు ది ఎడిటర్: సాహితీ కిరణం రోడ్ నంబర్ 3, అలకాపురి కాలనీ,  హైదరాబాద్ -500102 ఫోన్ నంబర్: 94907 51681